📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyబోర్‌వెల్ మోటార్ వైర్ల చోరీకి యత్నం.. నలుగురు పట్టివేత

బోర్‌వెల్ మోటార్ వైర్ల చోరీకి యత్నం.. నలుగురు పట్టివేత

📰 Generate e-Paper Clip

బోర్‌వెల్ మోటార్ వైర్ల చోరీకి యత్నం.. నలుగురు పట్టివేత

  • ముగ్గురు వ్యక్తులతో పాటు 16 ఏళ్ల బాలుడు అదుపులోకి

ప్రజావాణి రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16

షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామ శివారులో బోర్‌వెల్ మోటార్ వైర్లను కోసి చోరీ చేసేందుకు యత్నించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో బోర్‌వెల్ మోటార్ వైర్లను చోరీ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు,16 ఏళ్ల బాలుడు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని రామావత్ కిషన్, ఎస్లావత్ నరేష్, తేజావత్ చరణ్ గా మరో వ్యక్తిని 16 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించారు.అనంతరం నిందితులను షాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. చట్టపరమైన ప్రక్రియ అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.