📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఎల్లంపేట్‌ మున్సిపాలిటీలో రూ.59 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎల్లంపేట్‌ మున్సిపాలిటీలో రూ.59 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

ఎల్లంపేట్‌ మున్సిపాలిటీలో రూ.59 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, బీటీ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌లు

ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ సెప్టెంబర్‌ 16: ఎల్లంపేట్‌ పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.59 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎల్లంపేట్‌ పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ శ్రీమతి లావుడ్యా శ్రీదేవి రమేష్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఈ పనులను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
రూ.59 లక్షలతో పనులు అభివృద్ధి పనుల్లో భాగంగా డబుల్‌ పూర్‌ కమాన్‌ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించారు. అలాగే నూతనకల్‌ వార్డు నంబర్‌ 21లో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, అదే వార్డులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. నూతనకల్‌ వార్డు నంబర్‌ 22లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి రూ.4 లక్షలు కేటాయించారు. ఎల్లంపేట్‌ పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాల్లో రహదారుల మరమ్మతుల కోసం బీటీ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌లకు రూ.30 లక్షలు వెచ్చించనున్నారు. ఈ విధంగా మొత్తం రూ.59 లక్షల అంచనా వ్యయంతో ఐదు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ సమస్యలకు కొంతమేర పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మేకల దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌. కృష్ణారెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.