📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం

పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం

📰 Generate e-Paper Clip

పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం

వినాయక చవితి సందర్భంగా నాగారం మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవా కార్యక్రమం

నాగారం, సెప్టెంబర్ 16: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగారం మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాగారం వార్డు కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పండుగ సందర్భంగా కార్మికులతో కలిసి భోజనం చేయడం, వారికి ఆత్మీయతను పంచుకోవడం కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సతీష్ రెడ్డి, నాగారం మున్సిపల్ మాజీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాగారం మాజీ కౌన్సిలర్ కౌకుట్ల అనంతరెడ్డి, మాజీ వార్డు సభ్యులు సాయినాథ్ గౌడ్, కొండల్ రెడ్డి, కీసర మండల సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్, ఎర్ర పురుషోత్తం, బండారి నర్సింగరావు, శ్రీకాంత్, ప్రవీణ్, విగ్రహదాత నవీన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రజారోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం ప్రతిరోజూ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పండుగ సందర్భాల్లో కార్మికులను గుర్తు చేసుకుని వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడం సామాజిక బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
అన్నదాన కార్యక్రమం పురుషోత్తం, నర్సింగరావు, ప్రవీణ్ మరియు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో పలువురు స్థానికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.