*విషాదం.. బాలుడి మృత్యువాత*
*14 ఏళ్ల బాలుడి మృతితో యర్రవరం గ్రామంలో విషాదఛాయలు*
*కోదాడ సెప్టెంబర్ 16 (ప్రజావాణి)*: డెంగీ తీవ్ర జ్వరంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యర్రవరం గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు షేక్ మహీద్ మృతి చెందాడు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.
బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని గతంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాలుడిని కాపాడేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విషాదం నెలకొందిమహీద్ మృతి విషయం తెలుసుకున్న యర్రవరం గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మృతుడి కుటుంబ సభ్యులను గ్రామస్థులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

