📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadకోటగిరిలో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు.

కోటగిరిలో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు.

📰 Generate e-Paper Clip

తెలంగాణ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే.

జిల్లా కార్యవర్గ సభ్యులు వై.ఓమయ్య.

రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.

నియోజకవర్గ కార్యదర్శి దుబాస్ రాములు.

తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.

మండల కార్యదర్శి విఠల్ గౌడ్.

కోటగిరిలో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు.

కోటగిరి/ప్రజావాణి:-తెలంగాణ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని నిజామాబాద్ జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు వై.ఓమయ్య పేర్కొన్నారు.రైతాంగ సాయుధ పోరాట చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకా ల్లో చేర్చాలనీ బాన్సువాడ నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి దుబాస్ రాములు డిమాండ్ చేశారు.తెలంగాణ విలీన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనీ కోటగిరి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు.బుధవారం కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ నలంద పాఠశాలలో మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండల సిపిఐ కార్యదర్శి విఠల్ గౌడ్ అధ్యక్షతన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు.ఈ వారోత్సవాలకు నిజామా బాద్ జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు వై.ఓమయ్య,బాన్సువాడ నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి దుబాస్ రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ,1948 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగం కాలేదని హైదరాబాద్ సంస్థానం గా నిజాం నవాబు ఆధీనంలో ఉండేదని గుర్తుచేశారు.1946 నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది తెలంగాణ ప్రజలను సమీకరించి నిజాం నవాబుకు వ్యతిరేకంగా,తెలం గాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయాలని పోరాటం చేశామన్నారు.ఈ ప్రాంతంలో పేద రైతుల భూములను ఆక్రమించిన పటేల్,పట్వారీలు,రజాకార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినట్లు తెలిపారు. దొరలను గడిల నుంచి తరిమికొట్టాలి అనే నినాదాన్ని ఇచ్చిన పార్టీ సిపిఐ అని.ఈ పోరాటంలో నాల్గున్నర వేల మంది పార్టీ కార్యకర్తలు,నాయకులు అమరులయ్యారని పేర్కొన్నారు.అంతటి చారిత్రాత్మ కమైన పోరాటాన్ని బిజెపి హిందూ,ముస్లిం పోరాటంగా చిత్రీకరించే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.ఈ పోరాటంలో హిందువులతో పాటు ముస్లింలు కూడా నిజాంకు వ్యతిరేకం గా ఉద్యమించి తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు.షేక్ బందగి వేలాది మంది ప్రజలను నిజాంకు వ్యతిరేకంగా సమీకరించగా, మగ్దూం మోహినుద్దీన్ తన కవిత్వాల ద్వారా ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు.రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి,పుచ్చలపల్లి సుందరయ్య లాంటి అనేక మంది వీరులు పోరాడగా దొడ్డి కొమురయ్య,చాకలి ఐలమ్మ లాంటివారు రజాకార్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు ఎప్పటికీ మరిచి పోరని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించాలని అలాగే పాఠ్యపుస్తకాలలో రైతాంగ సాయుధ పోరాట చరిత్రను చేర్చాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు నల్ల గంగాధర్,కొట్టే ప్రసాద్,వీరేశం, కే.రాజు,శంకర్,కప్ప సాయిలు,మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.