📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆపదలో పేదలకు అండగా సీఎం సహాయనిధి

ఆపదలో పేదలకు అండగా సీఎం సహాయనిధి

📰 Generate e-Paper Clip

*ఆపదలో పేదలకు అండగా సీఎం సహాయనిధి*

*10 మంది లబ్ధిదారులకు రూ.3.47 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*

మేడ్చల్: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పలువురు పేదలు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.3,47,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మొత్తం 10 మంది లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఖరీదైన వైద్యం భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు.

లబ్ధిదారుల వివరాలు

మేడ్చల్‌కు చెందిన సత్యమ్మకు రూ.60,000, శామీర్‌పేట్‌కు చెందిన రాగిరి బాబుకు రూ.11,500, మేడిపల్లికి చెందిన మధుకు రూ.10,500, శామీర్‌పేట్‌కు చెందిన మేడి జోయెల్‌కు రూ.7,000, వరలక్ష్మికి రూ.19,500, కీసరకు చెందిన శ్రీకాంత్‌కు రూ.19,500, వెంకటేష్‌కు రూ.39,000, కీసరకు చెందిన రాజుశా శ్రీకి రూ.60,000, వినోద్ కుమార్‌కు రూ.60,000, లాల్‌గడి మలక్‌పేట్‌కు చెందిన ఆకుల లిఖితకు రూ.60,000 చొప్పున సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం మంజూరైంది.

మొత్తంగా పది మంది లబ్ధిదారులకు రూ.3,47,000 విలువైన చెక్కులు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య చికిత్స సమయంలో ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పేద ప్రజలకు వైద్యపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అత్యవసర వైద్య అవసరాలతో బాధపడుతున్న అర్హులైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మరింత సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.