📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadఈనెల 19న నిజామాబాద్‌లో మాదిగ మహిళా సమాఖ్య జిల్లా సదస్సు.

ఈనెల 19న నిజామాబాద్‌లో మాదిగ మహిళా సమాఖ్య జిల్లా సదస్సు.

📰 Generate e-Paper Clip

ఈనెల 19న నిజామాబాద్‌లో మాదిగ మహిళా సమాఖ్య జిల్లా సదస్సు.

సందీప్ గార్డెన్స్‌లో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలి.

కులమతాలకు అతీతంగా మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలి.

సదస్సు అనంతరం నూతన జిల్లా కమిటీల ఎన్నిక.

మహిళలపై లింగవివక్ష, అసమానతలపై పోరుకు సిద్ధం కావాలి.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ మాదిగా.

కోటగిరి/ప్రజావాణి:-ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సందీప్ గార్డెన్స్‌లో జరగనున్న మాదిగ మహిళా సమాఖ్య,మహాజన మహిళా మండలి జిల్లా సదస్సును విజయవంతం చేయాలని మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్ముటు పద్మ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కోటగిరి,పోతంగల్ మండలాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొందాపురం పోశట్టి మాదిగ,నేర్రోల్ల అశోక్ మాదిగ అధ్యక్షతన సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న లింగవివక్ష,అసమానతలకు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన ఉద్యమానికి మహిళలను సిద్ధం చేస్తున్నామన్నారు.ఇందులో భాగంగానే నిజామాబాద్‌లో జిల్లా మహిళా సదస్సునునిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ జిల్లా సదస్సు అనంతరం మాదిగ మహిళా సమాఖ్య,మహాజన మహిళా మండలి నూతన జిల్లా కమిటీలను ఎన్నుకుంటామన్నారు.కావున జిల్లాలోని మాదిగ మహిళలు కులమతాలకు అతీతంగా మహాజన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జాతీయ పొలిట్ బ్యూరో నాయకురాళ్లు సత్తక్క మాదిగ,పెద్దొల్ల యమున మాదిగ,కన్నూరు సుధ మాదిగ,బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సోంపూర్ పోచారం మాదిగ,కోటగిరి గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు హెచ్.లాలయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు కన్నం శ్రీనివాస్,పేగు లాలయ్య, ఏ.సాయిలు,హెచ్.శ్రీకాంత్,జండా దినేష్,యాద్గాపూర్ కృష్ణ, పి.సుధాకర్,బి.సాయిరాం,బి.దత్తు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.