అన్నోజిగూడ, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): గణేష్ చతుర్థి సందర్భంగా అన్నోజిగూడ ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు గంధమాల రాజశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గుబ్బ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యువకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని శ్రీ సాయి యూత్ అసోసియేషన్ సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానిక యువకులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.


