భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
కూకట్‌పల్లి విలేజ్ బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు
కూకట్పల్లి : (ప్రజావాణి) సెప్టెంబర్ 16
కూకట్‌పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి విలేజ్ బజరంగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రజలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించాలని యువతకు పిలుపునిచ్చారు. భక్తి, సేవాభావంతో పండుగను ఘనంగా జరుపుకోవాలని బజరంగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు కోరారు.

