📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి మానవత్వం: రోడ్డు ప్రమాద బాధితుడికి తక్షణ సహాయం

గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి మానవత్వం: రోడ్డు ప్రమాద బాధితుడికి తక్షణ సహాయం

📰 Generate e-Paper Clip

కంభం:సెప్టెంబర్ 15:ప్రజావాణి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని నిరూపించారు గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి.మొహిద్దీన్ పురం నుండి కంభం వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రభుత్వ అధికారికి ఆయన తక్షణమే స్పందించి,అండగా నిలిచారు.ప్రమాదం జరిగిన తీరు.వివరాల్లోకి వెళ్తే.వీఆర్వో శ్రీనివాసులు మొహిద్దీన్ పురం నుండి కంభం వైపుగా ప్రయాణిస్తున్నారు.ఈ క్రమంలో మార్గమధ్యంలో ఒక్కసారిగా బర్రెలు అడ్డురావడంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో వీఆర్వో శ్రీనివాసులు కి తీవ్ర గాయాలయ్యాయి.సకాలంలో స్పందించిన కుందూరు నాగార్జున రెడ్డి.అదే సమయంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి.అదే మార్గంలో వేరే కార్యక్రమానికి వెళ్తున్నారు.రహదారిపై జరిగిన ప్రమాదాన్ని మరియు తీవ్ర గాయాలతో ఉన్న వీఆర్వో శ్రీనివాసులు.ని గమనించిన ఆయన, తన వాహనాన్ని వెంటనే పక్కకు నిలిపివేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షతగాత్రుడి వద్దకు చేరుకుని వారిని పరామర్శించి,ధైర్యం చెప్పారు.
అంబులెన్స్ వచ్చే వరకు ఉండి..ఆసుపత్రికి తరలింపు
ప్రమాద తీవ్రతను గమనించిన నాగార్జున రెడ్డి.వెంటనే అత్యవసర అంబులెన్స్ సేవలకు సమాచారం అందించారు.కేవలం సమాచారం అందించి వెళ్ళిపోకుండా,బాధితుడికి మరింత ప్రాణాపాయం కలగకుండా ఉండేందుకు అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకునే వరకు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.అంబులెన్స్ రాగానే గాయపడిన వీఆర్వో శ్రీనివాసులు.ని సురక్షితంగా అందులోకి ఎక్కించి,త్వరితగతిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలా దగ్గరుండి సహాయం చేశారు.
రాజకీయ నాయకులు కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా,సమాజంలో ఆపదలో ఉన్న సామాన్యులకు,అధికారులకు అండగా నిలవాలని ఈ ఘటన ద్వారా కుందూరు నాగార్జున రెడ్డి. చాటిచెప్పారు.ఆయన చూపిన ఈ సమయస్ఫూర్తి,మానవత్వ వైఖరిపై స్థానిక ప్రజలు,ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆపద సమయంలో దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడిన నాగార్జున రెడ్డి,కి వీఆర్వో కుటుంబ సభ్యులు మరియు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.