గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి మానవత్వం: రోడ్డు ప్రమాద బాధితుడికి తక్షణ సహాయం
కంభం:సెప్టెంబర్ 15:ప్రజావాణి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని నిరూపించారు గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డి.మొహిద్దీన్ పురం నుండి కంభం వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రభుత్వ అధికారికి ఆయన తక్షణమే స్పందించి,అండగా నిలిచారు.ప్రమాదం జరిగిన తీరు.వివరాల్లోకి వెళ్తే.వీఆర్వో శ్రీనివాసులు మొహిద్దీన్ పురం నుండి కంభం వైపుగా ప్రయాణిస్తున్నారు.ఈ క్రమంలో మార్గమధ్యంలో ఒక్కసారిగా బర్రెలు అడ్డురావడంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో వీఆర్వో శ్రీనివాసులు కి...