📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఎస్సై వేధింపులకు తాళలేక బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన

ఎస్సై వేధింపులకు తాళలేక బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన

📰 Generate e-Paper Clip

ఎస్సై వేధింపులకు తాళలేక బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన

భూతగాధాలో ఎస్సై జోక్యం కల్పించుకొని వేధిస్తున్నాడని బాధిత కుటుంబం ఆరోపణ

 

ఎస్సై ద్వారా వారి కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన

దంతాలపల్లి ఎస్సై రవికుమార్ వేధింపులకు తాళలేక ఓ బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, దంతాలపల్లి మండలం తూర్పు తండా కు చెందిన రూప్సింగ్ మాట్లాడుతూ, గత 50 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇంటికి దారి లేదని శంకర్ అనే వ్యక్తి అడ్డుకుంటున్నాడని, ఈ అంశంపై స్థానిక ఎస్సై రవికుమార్ ను ఆశ్రయిస్తే, మాకు న్యాయం చేయవలసింది పోయి మీరు కబ్జా చేశారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువైపులా వాంగ్మూలాలు వినకుండానే అసభ్య పదజాలంతో మమ్ములను , మా మహిళలను దూషిస్తూ మీకు ఏదైనా జరిగితే నాకు అవసరం లేదు నేను చెప్పినట్లు వింటారా, లేకుంటే నీ సంగతి ఎలా చెప్పాలో నాకు తెలుసు, నిన్ను ఏ విధంగా కేసులో ఇరికించాలో నాకు తెలుసు అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధిత కుటుంబం మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. రక్షణ కల్పించవలసిన అధికారే మాపై దాడికి ఉసిగొల్పడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. దీని మూలంగానే, మా ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలు శంకర అనే వ్యక్తి పగలగొట్టడం జరిగిందని, మమ్ములను చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని, మాకు జరగరాని సంఘటన మాకు జరిగితే దానికి ఎస్ఐ ప్రధాన బాధ్యత వహించాలని, పేర్కొన్నాడు. అదేవిధంగా ఎస్సై నుండి మాకు మా కుటుంబానికి, ప్రాణహాని ఉందని బాధితుడు తెలిపాడు. కావున జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే స్పందించి ఎస్ఐ రవికుమార్ నుంచి మా కుటుంబానికి రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.