హుస్నాబాద్ కు బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కు వినతి పత్రం
సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామడుగు బాల్ రాజ్
పై అధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటాం
జనగామ బస్సు డిపో మేనేజర్ ఏం.ఉషా
మద్దూరు సెప్టెంబర్ 15, ప్రజా వాణి,
మండలంలోని లద్నూరు మీదుగా రెవెన్యూ డివిజన్ హుస్నాబాద్ కు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ మంగళవారం లద్నూరు గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామడుగు బాల్ రాజ్ బస్సు డిపో మేనేజర్ ఏం.ఉషాకు జనగామలోని తన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట, జనగామ జిల్లాలకు సరిహద్దులో ఉండడం వల్ల ప్రజలు హుస్నాబాద్ అర్ డి ఓ కార్యాలయానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. తక్షణమే మా మద్దూరు మండల ప్రజల బాధలను దృష్టిలో ఉంచుకొని నూతన బస్సు uసౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

