📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadకోటగిరిలో లయన్స్ క్లబ్ 320డి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే.

కోటగిరిలో లయన్స్ క్లబ్ 320డి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే.

📰 Generate e-Paper Clip

కోటగిరిలో లయన్స్ క్లబ్ 320డి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే.

మోక్షగుండ విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులు.

కోటగిరిలో వివిధ శాఖల ఏఈలకు లయన్స్ క్లబ్ సత్కారం.

గ్రామాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం.

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో మంగళవారం ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కోటగిరి మీటింగ్ ఆల్ నందు భారత రత్న కీ.శే.మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కోటగిరి మండల పరిధిలోని పలు విభాగాలలో ఇంజనీరింగ్ సేవలు అందిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ధనరాజ్,పీఆర్ ఏఈ నవదీష్ గౌడ్,ఇరిగేషన్ ఏఈ రవి కుమార్,విద్యుత్ ఏఈ బుజ్జిబాబు,అసిస్టెంట్ ఏఈ సిహెచ్.సుమిద.ఇంజనీర్లకు క్లబ్ ప్రతినిధులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఇంజనీరింగ్ డే సందర్భంగా మా సేవలను గుర్తించి సన్మానించి లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డిస్ట్రిక్ట్ 320D ప్రతినిధులకు సన్మాన గ్రహీతలు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు,సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ. గ్రామాలభివృద్ధి,మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.విశ్వేశ్వరయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో విష్ణు,లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డిస్ట్రిక్ట్ 320D ప్రధాన కార్యదర్శి పత్తి లక్ష్మణ్,ప్రతినిధులు జి.హనుమంత్ రావు,పి.అశ్విని సేట్,పి.నిశాంత్ సేట్, పి.అనిల్,కే.సిద్దు,డి.ఉదయ భాస్కర్,బీ.శ్యామ్,హౌగిరావ్ పటేల్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.