📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaశివాజీ నగర్‌ లో విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు

శివాజీ నగర్‌ లో విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

శివాజీ నగర్‌ లో విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

మునుగోడు నియోజకవర్గం లోని చండూరు మున్సిపాలిటీ శివాజీ నగర్‌లో విగ్రహ దాత ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొదటి రోజు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్వాయి జితేందర్ రెడ్డి, మమత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే కౌన్సిలర్ కోడి సుష్మ వెంకన్న, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు, స్థానికులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విగ్రహ దాత ఎస్సై శివకుమార్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.