📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyబాల గణపతికి ఘనంగా నీరాజనం

బాల గణపతికి ఘనంగా నీరాజనం

📰 Generate e-Paper Clip

*బాల గణపతికి ఘనంగా నీరాజనం!

*ఓడీఎఫ్‌ కాలనీలో కొలువుదీరిన బాల గణనాథుడు..

* భక్తిశ్రద్ధలతో పూజలు
చి

న్నారుల నృత్య ప్రదర్శనలతో సందడి..

* ప్రతిభావంతులకు షీల్డుల అందజేత

అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 15 (ప్రజావాణి): అమీన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీలో బాల గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాల గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన కాలనీవాసులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గణపయ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఓడీఎఫ్‌ కాలనీ పండుగ శోభను సంతరించుకుంది. గణనాథుడి నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి.
వినాయక చవితి వేడుకల్లో భాగంగా చిన్నారుల కోసం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డాన్స్‌ మాస్టర్‌ నిక్షిత గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ కళా ప్రతిభను చాటుకున్నారు. లయబద్ధమైన నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకోగా.. వారి ప్రదర్శనలకు కాలనీవాసుల నుంచి విశేష స్పందన లభించింది. చప్పట్లతో చిన్నారులను ప్రోత్సహించారు.
అనంతరం నృత్య ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో షీల్డులు అందజేసి అభినందించారు. చిన్నారులను ప్రోత్సహించేలా ఉత్సవ కమిటీ నిర్వహించిన కార్యక్రమాన్ని కాలనీవాసులు ప్రశంసించారు.
ఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న బాల గణపతి ఉత్సవాలు ఈసారి కూడా ఓడీఎఫ్‌ కాలనీలో భక్తి, ఆనందోత్సాహాలను నింపాయి. బాల గణనాథుడి సన్నిధిలో చిన్నారుల సాంస్కృతిక సందడి వేడుకలకు మరింత వన్నె తెచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.