కోదాడ, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం యర్రవరం గ్రామానికి చెందిన 14 ఏళ్ల షేక్ మహీద్ తీవ్ర డెంగ్యూ జ్వరంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మాజీ మండల కో ఆప్షన్ షేక్ ఉద్దండుకు చిన్న కుమారుడైన మహీద్కు డెంగ్యూ తీవ్రతరం కావడంతో మెదడుకు సంబంధించిన తీవ్రమైన సమస్య తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్, బేగంపేటలో అపస్మారక స్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. మహీద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో చికిత్సకు రోజురోజుకూ భారీగా ఖర్చవుతోంది. ఇప్పటికే కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో, వైద్య ఖర్చులను భరించడం కష్టంగా మారింది.మహీద్ ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మాజీ మంత్రి కేటీఆర్, ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు, మీడియా ప్రతినిధులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.చిన్న మొత్తమైనా ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ఎంతో అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. మహీద్ చికిత్సకు సహాయం చేయదలచిన వారు:సంప్రదించవలసిన వ్యక్తి: షేక్ రసూల్
ఫోన్: 9032582985

14 ఏళ్ల బాలుడి ప్రాణాల కోసం ఆపన్నహస్తం అందించండి
RELATED ARTICLES

