14 ఏళ్ల బాలుడి ప్రాణాల కోసం ఆపన్నహస్తం అందించండి
కోదాడ, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం యర్రవరం గ్రామానికి చెందిన 14 ఏళ్ల షేక్ మహీద్ తీవ్ర డెంగ్యూ జ్వరంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మాజీ మండల కో ఆప్షన్ షేక్ ఉద్దండుకు చిన్న కుమారుడైన మహీద్‌కు డెంగ్యూ తీవ్రతరం కావడంతో మెదడుకు సంబంధించిన తీవ్రమైన సమస్య తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్, బేగంపేటలో అపస్మారక స్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. మహీద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో చికిత్సకు రోజురోజుకూ భారీగా...