-36 సూచనలు జారీ
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
*1.* మండపాలను ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. స్థలం కోసం సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలి.
*2.* ప్రతి మండపం వివరాలను https://policeportal.tspolice.gov.in లింక్లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
*3.* మహిళలు, యువతుల పట్ల ఈవ్ టీజింగ్ జరగకుండా చూడాలి.
*4.* సౌండ్ సిస్టమ్ పరిమితంగా వాడాలి. 65 డెసిబెల్స్ దాటకూడదు. వృద్ధులు, చిన్నారులు, రోగులకు ఇబ్బంది కలగకూడదు.
*5.* రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడరాదు. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి.
*6.* డీజేలు పూర్తిగా నిషేధం. మైక్ పర్మిషన్ కోసం సంబంధిత SDPO ని సంప్రదించాలి.
*7.* విద్యుత్ వైరింగ్ నాణ్యతతో చేయాలి. షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*8.* అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే Dial 112 కు లేదా కంట్రోల్ రూమ్ కు తెలపాలి.
*9.* ప్రతి మండపం వద్ద ఉదయం, రాత్రి 2-3 మంది కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలి.
*10.* ప్రతి మండపం వద్ద పాయింట్ బుక్ ఏర్పాటు చేసుకోవాలి.
*11.* అపరిచిత వ్యక్తులపై నిఘా ఉంచి సమాచారం ఇవ్వాలి.
*12.* అనుమానాస్పద బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు కనిపిస్తే తాకకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
*13.* నిమజ్జనం రోజు, సమయం, మార్గం వివరాలను ముందుగానే సంబంధిత పోలీస్ స్టేషన్ కు తెలపాలి.
*14-15.* మండపం, వేదిక బలంగా, నాణ్యతతో నిర్మించాలి. జంతువులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*16.* భక్తులకు క్యూ పద్ధతి, బారికేడ్లు తప్పనిసరి.
*17.* లైటింగ్ కోసం నాణ్యమైన వైర్లు, PVC పైపులు, సురక్షితమైన Flood Lights వాడాలి.
*18.* అగ్ని ప్రమాదాల నివారణకు 2 బకెట్ల నీళ్లు, 2 బకెట్ల ఇసుక, ఫైర్ బాల్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.
*19-21.* యువకులు సంయమనం పాటించాలి. పుకార్లు నమ్మరాదు. పోలీసుల నిరంతర నిఘా ఉంటుంది.
*22.* సమీప పోలీసుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి.
*23.* మట్టి గణపతులను, తక్కువ ఎత్తు విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడాలి.
*24-26.* భక్తులకు క్యూ, పార్కింగ్ క్రమబద్ధంగా ఉండాలి. మద్యపానం, పేకాట, జూదం నిషేధం.
*27-30.* నిమజ్జనం రోజు క్యూ పాటించాలి, లైటింగ్ ఉండాలి, చిన్న పిల్లలను తీసుకురావద్దు, చిల్లర దొంగల పట్ల జాగ్రత్త.
*31-34.* భజనలు భక్తిభావంతో చేయాలి. చెరువులు, కాలువల్లో జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి. ఈత వచ్చిన వారు ఉండాలి. JCB లతో తవ్విన గుంటల్లో నిమజ్జనం వద్ద జాగ్రత్తలు అవసరం.
*35.* వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
*36.* విగ్రహం తీసుకొచ్చే, తీసుకెళ్లే దారిలో కరెంట్ వైర్లు, ఎత్తును ముందే పరిశీలించుకోవాలి.
జిల్లా ప్రజలందరూ పోలీసులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ కోరారు.

