📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్వినాయక మండపాల్లో కాంగ్రెస్ నేత గరిసెల సురేందర్ ముదిరాజ్ ప్రత్యేక పూజలు

వినాయక మండపాల్లో కాంగ్రెస్ నేత గరిసెల సురేందర్ ముదిరాజ్ ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

వినాయక మండపాల్లో కాంగ్రెస్ నేత గరిసెల సురేందర్ ముదిరాజ్ ప్రత్యేక పూజలు

గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. యూత్ అసోసియేషన్ల ఆహ్వానం మేరకు గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా డివిజన్‌కు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినాయకుడికి పూజలు నిర్వహించి, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం వినాయక ఉత్సవ నిర్వాహకులను అభినందించి, డివిజన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ అసోసియేషన్ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.