రేపే బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ
స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహణ
బెజ్జంకి, సెప్టెంబర్ 14 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని గుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణను స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించనున్నట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ తెలిపారు.భక్తులు ఉదయం 6.15 గంటలకు గుట్ట వద్దకు చేరుకోవాలని,ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణ జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

