📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకానిస్టేబుల్ ను బలిగొన్న పర్సనల్ లోన్

కానిస్టేబుల్ ను బలిగొన్న పర్సనల్ లోన్

📰 Generate e-Paper Clip

కానిస్టేబుల్ ను బలిగొన్న పర్సనల్ లోన్

ఈ ఎం ఐ లు కట్టలేక..తిప్పలు

లుంగీ తో ఊరి వేసుకొని మృతి

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

స్టేట్, ప్రజావాణి

తీసుకున్న పర్సనల్ లోన్‌ను సకాలంలో కట్టలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పవన్ కుమార్(30) సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
భార్య, కూతురు, కుమారుడితో కలిసి 3 నెలలుగా బోరబండ ఠాణా పరిధిలోని ఇందిరానగర్ లో నివసిస్తున్నాడు. కాగా, వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్‌ ను తిరిగి చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున బాత్‌రూమ్‌లోకి వెళ్లి, బయటకు రాలేదు. భార్యకు అనుమానం వచ్చి, కుటుంబసభ్యులతో కలిసి డోర్​ను తొలగించి చూడగా.. పవన్ కుమార్ షవర్‌కు లుంగీతో ఉరేసుకొని కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.