📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaవినాయక చవితి వేళ మార్కెట్‌ కిటకిట

వినాయక చవితి వేళ మార్కెట్‌ కిటకిట

📰 Generate e-Paper Clip

*వినాయక చవితి వేళ మార్కెట్‌ కిటకిట*

సిరిసిల్ల, ప్రజావాణి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన మార్కెట్‌ ప్రాంతం జనం తో కిక్కిరిసిపోయింది. పండుగకు అవసరమైన పూలు, పండ్లు, పూజా సామగ్రి, వినాయక విగ్రహాలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు.దీంతో మార్కెట్‌లో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. జనాలు, తోపుడు బండ్లు, దుకాణాల ముందు కొనుగోలుదారులతో నడిచేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం వేళ రద్దీ మరింత పెరిగింది. పండుగ కొనుగోళ్లతో మార్కెట్‌ ప్రాంతం కళకళలాడగా, వ్యాపారులు కూడా ఉత్సాహంగా కనిపించారు.వినాయకుడి పూజ కోసం సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్‌లో పండుగ సందడి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.