📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఓటు హక్కు కోల్పోకుండా అప్రమత్తంగా

ఓటు హక్కు కోల్పోకుండా అప్రమత్తంగా

📰 Generate e-Paper Clip

ఓటు హక్కు కోల్పోకుండా అప్రమత్తంగా ఉండాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే కీలక సూచనలు

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 13 (ప్రజావాణి): కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే నియోజకవర్గంలోని మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలు, నాయకులు, బూత్‌ ఇన్‌చార్జులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటర్లకు సరైన అవగాహన కల్పిస్తూ, నోటీసులు అందుకున్న వారికి అందుబాటులో ఉండి అవసరమైన గుర్తింపు పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించేలా సహకరించాలని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఓటు హక్కును కాపాడేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఓటు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని పేర్కొన్నారు. అవగాహన లేని ప్రజలకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వివరించి, వారి ఓటు హక్కు కోల్పోకుండా చూడటం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.