విద్య, వైద్యం, ఉపాధి కోసం ఉద్యమిస్తాం
ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దొంతరవేణి మహేష్
బెజ్జంకి, సెప్టెంబర్ 11 (ప్రజావాణి)
యాదగిరిగుట్టలో జరిగిన ఏఐవైఎఫ్ తెలంగాణ 3వ రాష్ట్ర మహాసభల్లో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన దొంతరవేణి మహేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎన్నుకున్న సిపిఐ , ఏ ఐ వై ఐఫ్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపుతూ యువతకు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ,యువజన హక్కుల సాధన కోసం ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని మహేష్ స్పష్టం చేశారు.

