📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadచాకలి ఐలమ్మ త్యాగం చిరస్మరణీయం

చాకలి ఐలమ్మ త్యాగం చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

చాకలి ఐలమ్మ త్యాగం చిరస్మరణీయం

 

రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ ది చెరగని ముద్ర

వెట్టి చాకిరి, విముక్తి కోసం పోరాడిన యోధురాలు

 

ఘనంగా రజక వృత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 41వ వర్థంతి

ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్*

 

తెలంగాణ సాయుధ పోరాటంలో, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్థంతిని గురువారం మహబూబాబాద్ జిల్లా తోర్రూర్ పట్టణ కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో రజక వృత్తి దారులు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చెరగని ముద్ర వేసిన గొప్ప మహిళా యోధురాలని అన్నారు. సామాజిక అన్యాయం, జమీందారీ వ్యవస్థ, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా పోరాడి అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.ఉద్యమ నాయకురాలు వీరనారి చాకలి ఐలమ్మ పాలకుర్తి గడ్డ పై జన్మించడం గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో తోర్రూర్ రజక సంఘం మండలాద్యక్షు నిమ్మల.సోమయ్య, కార్యదర్శి పొడగంటి శేఖర్ ,పట్టణ అధ్యక్షుడు చింతల. రాజు, కార్యదర్శి చింతల .మధు, నాయకురాలు ఓరుగంటి చైతన్య,నాయకులు ఓరుగంటి . ప్రవీణ్,మడిపెద్ది కార్తిక్,కొండ్రతి రామక్రిష్ణ,సైదులు,రాకున్నా, శ్రీకాంత్, శ్రీనివాస్,బిక్షం , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.