📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadకేసీఆర్ కుటుంబానికి, భవిష్యత్తులో చావు డప్పు మోగిస్తాం

కేసీఆర్ కుటుంబానికి, భవిష్యత్తులో చావు డప్పు మోగిస్తాం

📰 Generate e-Paper Clip

కేసీఆర్ కుటుంబానికి, భవిష్యత్తులో చావు డప్పు మోగిస్తాం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను దూషించిన బిఆర్ఎస్ పై భగ్గుమన్న దళిత నాయకులు

 

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు దూషించడంపై, కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు తొర్రూరు పట్టణ కేంద్రంలో కెసిఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి చావు డబ్బు, కొడుతూ, బస్టాండ్ చౌరస్తా నుండి కూరగాయల మార్కెట్ చౌరస్తా వరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సబ్బండ వర్గాలు, పోరాటం చేసి, తెలంగాణ విద్యార్థి లోకం 1200 మంది ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న త్యాగాల తెలంగాణను, కెసిఆర్ కుటుంబం వారి భోగాల తెలంగాణగా మార్చుకొని, నీళ్లు నిధులు నియామకాలు అంటూ ప్రజల్ని రెచ్చగొట్టి, అనేకమందిని పొట్టన పెట్టుకున్న, కల్వకుంట్ల కుటుంబం, అధికారం చేజారగాని, అఘోరాలుగా మారి కెసిఆర్ కుటుంబం, దళితులను, అవమానపరుస్తూ, ప్రభుత్వం పట్ల పోలీసుల పట్ల అసభ్యకర పదజాలంతో, రోడ్లపైకి వచ్చి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఆనాడు బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, ధర్నాచౌకులను ఎత్తివేసి, ప్రజలకు ధర్నాలు చేసే అధికారం లేదని పోలీస్ అధికారులు చేత కేసులు పెట్టించి, ప్రజాస్వామ్యాన్ని పాడెక్కించిన, కెసిఆర్ కుటుంబం, ఈనాడు “దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా” ప్రజలకు సంక్షేమ ఫలాలు అమలు చేయాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీ చేసి, యావత్ దళిత సమాజాన్ని అవమానానికి గురి చేస్తే, దళితులు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిరసన తెలుపడానికి వస్తే, దళితులు రావడం మైల పడిందంటూ పసుపు నీళ్లు చల్లి, శుద్ధి చేసుకుని దళితులను అవమానపరిచిన బిఆర్ఎస్ నాయకుల్లారా మా వాడల్లోకి వస్తే మీకు దే శుద్ధి చేస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దొరతనానికి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అహంకారానికి చౌడప్ప కొట్టే రోజులు దగ్గర పడ్డాయని వారు జోష్యం చెప్పారు. 1200 మంది విద్యార్థుల బలిదానాల పునాదుల పైన నిర్మించుకున్న తెలంగాణను, కల్వకుంట్ల కుటుంబం, బందిపోట్ల రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు నిలువు దోపిడీ చేసిందని దళిత నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని దగాకోరు మాటలు మాట్లాడి, దళితులను మోసం చేస్తే తెలంగాణ ప్రజలు కరువు కాల్చి వాత పెట్టారన్నారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంటే, వాటిని చూసి ఓర్వలేక, దళితుడిని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవి కట్టబెడితే , కెసిఆర్ కుటుంబం నీచ బుద్ధితో దూషించడం ఏమిటి ప్రశ్నించారు. పావుశేరు తాగి ఫామ్ హౌస్ లో పండే కెసిఆర్ గొప్ప నాయకుడని ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేని దద్దన్న రేపు ఓట్ల కోసం దళితవాడలోకి వస్తే, దళిత సమాజం చేతిలో మీకు మీ పార్టీకి చావు దెబ్బ తప్పదని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా బే షరతుగా బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కేటీఆర్ ,హరీష్ రావు, తాత మధు దళిత సమాజానికి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే దళిత సమాజ ఆగ్రహానికి గురికాక , తప్పదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ గత చరిత్రను గుర్తుచేసుకోకుండా, కెసిఆర్ కుటుంబం దొరతనాన్ని చూపిస్తుందని వారు పేర్కొన్నారు. నిజాం లాంటి నిరంకుశ పరిపాలన చేసిన వాడినే పైజాముడగొట్టి, పంపిన చరిత్ర తెలంగాణ ప్రజలదని కేసీఆర్ కుటుంబం గుర్తించుకోవాలని, వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మోత్కూరి రవీంద్ర చారి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్, దళిత సంఘాల నాయకులు సోమారపు ఐలయ్య, నకిరకంటి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.