EVENING EDITION
📄 ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్శ్రీకాకుళంజిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..

శ్రీకాకుళంజిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..

📰 Generate e-Paper Clip

శ్రీకాకుళంజిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..

 

కరువు సహాయక చర్యలు చేపట్టాలి.

 

మాకన్నపల్లి సచివాలయ అధికారికి వినతి పత్రము

 

పలాస ప్రజావాణి ప్రతినిధి

 

శ్రీకాకుళం జిల్లా ను కరవు జిల్లాగా ప్రకటించి , కరువు నివారణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘము నేత తెప్పల అజయ్ కుమార్ అధికారికి వినతి పత్రము ఇచ్చారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ప్రత్యామ్నాయ స్వల్పకాలిక విత్తనాలు రబీసీజన్ కు ఉచితంగా సరఫరా చేయాలని, ఉపాధి హామీ పథకం 200 రోజులు పని దినాలుగా ప్రకటించి, రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ మాకనపల్లి గ్రామ సచివాలయ అధికారినివారికి గురు వారము వినతిపత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెప్పల అజయ్ కుమార్, సాలిన వీరస్వామి, కోరాడ లింగమూర్తి, బత్తిని ప్రసాద్, తెప్పల రాజు, బత్తిన దుర్యోధన, సలీన కోదండరావు, జుత్తు లోకనాథం, ఎం జీవన్ రావు, గతం ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.