*పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
బుధవారం స్థానిక మున్సిపాలిటీ ఆవరణలో 1,69,500/- రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మరియు కౌన్సిలర్లు అందరు కలిసి ఆరుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కృషితో అనేకమంది పేద కుటుంబాలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నాయని అన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. చెక్కులు అందుకున్న వారిలో చిలుకూరు శ్రీనివాసులు 39,000 రూపాయలు, భూతరాజు లక్ష్మమ్మ 16000 రూపాయలు, చొప్పరి నరసింహ 40,000 రూపాయలు, గొర్లకొండ పవన్ కుమార్ 26,000 రూపాయలు, ఖమ్మంపాటి శివమని 22,500 రూపాయలు,బొమ్మ కట్టి లక్ష్మి 26,000 రూపాయలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, కలిమికొండ పారిజాత జనార్ధన్, బుషిపాక వాసు, చేనేత సహకారం సంఘం అధ్యక్షులు పున్న ధర్మేందర్, కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, ఖలీల్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, పన్నాల లింగయ్య, భీమనపల్లి శేఖర్, బొమ్మరబోయిన వెంకటేశం, కన్నెబోయిన నాగరాజు, బెల్లంకొండ శేకర్, గజ్జల కృష్ణారెడ్డి, కారింగు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


