📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపత్తి పంట ఎండిపోయిందని బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

పత్తి పంట ఎండిపోయిందని బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

పత్తి పంట ఎండిపోయిందని బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

 

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

గురువారం సాయంత్రం సుమారు 05:25 గంటలకు, చండూర్ మండలం బొడంగపర్తి గ్రామానికి చెందిన ఎస్.కె. జానీ మియా (42), వ్యవసాయ రైతు. తన స్వగ్రామంలో సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. అయితే సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి పంట పూర్తిగా ఎండిపోయినట్లు సమాచారం. దీంతో పంట నష్టంతో పాటు అప్పులు పెరుగుతాయనే ఆందోళనతో మనస్తాపానికి గురైన జానీ మియా వ్యవసాయ భూమి వద్ద గుర్తుతెలియని విషపదార్థం సేవించినట్లు ప్రాథమిక సమాచారం.

అనంతరం కుటుంబ సభ్యులు/స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.