📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజా సేవలో మరో మైలురాయి మారుమూల గిరిజన పల్లెలకు చేరనున్న 'ఆరోగ్య రథాలు'

ప్రజా సేవలో మరో మైలురాయి మారుమూల గిరిజన పల్లెలకు చేరనున్న ‘ఆరోగ్య రథాలు’

📰 Generate e-Paper Clip

*ప్రజా సేవలో మరో మైలురాయి మారుమూల గిరిజన పల్లెలకు చేరనున్న ‘ఆరోగ్య రథాలు’!*

 

 

 

 

జాతీయ ఎస్టీ కమిషన్ జాటోతు హుస్సేన్ నాయక్.

 

 

 

 

 

నిరంతరం జనం కోసం తపించే నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.

 

 

 

 

కేసముద్రం సెప్టెంబర్ 09,ప్రజావాణి.

 

 

 

 

ప్రజా సంక్షేమమే పరమావధిగా, సమాజ సేవలో ముందుండే నాయకత్వం, నిరంతరం శ్రమించే కార్యకర్తల సైన్యం ఉంటే గ్రామీణ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయో మహబూబాబాద్ జిల్లా గూడూరు మరోసారి నిరూపించింది. ఓ ఎన్ జి సి సంస్థ సీఎస్‌ఆర్, నిధుల సహకారంతో గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన నాలుగు నూతన పేషెంట్ ట్రాన్స్పోర్ట్ అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గూడూరు, మహబూబాబాద్ టౌన్, కేసముద్రం, నెల్లికుదురు మండలాల ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఈ అంబులెన్సులను కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 

 

 

 

 

*గిరిజనుల ఆరోగ్య భద్రతే లక్ష్యం.. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్.*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ ఎస్టీ కమిషన్ గౌరవ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. గిరిజన పల్లెల్లోని పేద ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఈ అంబులెన్సులు కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.బృహత్తర కార్యాన్ని విజయవంతం చేయడంలోను, ప్రభుత్వ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోను అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలు, స్థానిక నాయకుల పాత్ర అమోఘం. జనం మెచ్చేలా, అందరూ సంతోషించేలా సేవా పథకంతో ముందుకెళ్తున్న కార్యకర్తల సైన్యానికి పత్రికా ముఖంగా అభినందనలు.ఈ వేడుకలో మాజీ రాజ్యసభ సభ్యులు గరికిపాటి మోహన్ రావు, ప్రముఖ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మహబూబాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో తోడుంటూ, పల్లె పల్లెకూ ఆరోగ్య భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్న జిల్లా ఉపాధ్యక్షులు పొదిలి నరసింహారెడ్డి, మండల అధ్యక్షులు ఉప్పునూతల రమేష్, మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి, ముదిరెడ్డి మురళీధర్, భానోత్ రాము తదితర నాయకులను, అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను ప్రజలు కొనియాడుతున్నారు.నాయకుల సంకల్పం, కార్యకర్తల సేవా నిరతి తోడైతే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో ఈ కార్యక్రమం నిరూపించింది.అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద రోగులకు ఈ ‘ఆరోగ్య రథాలు’ నిజంగానే సంజీవనిలా మారనున్నాయి. నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు జోహార్లు!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.