కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా
తెలుగు భాషా దినోత్సవం
తెలంగాణ యాసలో ప్రజల గొంతుకగా కాళోజీ
ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి,
డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్,
వైస్ ప్రిన్సిపాల్ ప్రీతీ రెడ్డి
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 9 ప్రజావాణి:
మహబూబాబాద్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి, డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతీ రెడ్డి
మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావును ప్రజలందరూ “ప్రజాకవి”గా పిలుస్తారని అన్నారు. తెలంగాణ యాసలో రచనలు చేస్తూ ప్రజల సమస్యలకు, ఆకాంక్షలకు తన సాహిత్యం ద్వారా గొంతుకగా నిలిచారని తెలిపారు. పుట్టుక, చావులను మినహాయించి తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ అని పేర్కొన్నారు.
కాళోజీ నారాయణరావు కర్ణాటకలో జన్మించి, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని విద్యార్థులకు వివరించారు. సాహిత్య, సామాజిక రంగాల్లో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు. విద్యార్థులు కాళోజీ సాహిత్యాన్ని, తెలంగాణ భాషా వైభవాన్ని తెలుసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులు అర్పించారు.

