“ప్రజా వాణి” వార్తకు స్పందన
విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తా
జనగామ బస్సు డిపో మేనేజర్ ఎం.ఉషా
మద్దూరు సెప్టెంబర్9, ప్రజా వాణి,
విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని జనగామ డిపో మేనేజర్ ఏం. ఉషా అన్నారు.బుదవారం మండలంలోని లద్నూరు గ్రామంలో జనగామలో విద్యను అభ్యసిస్తున్న జూనియర్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం లద్నూరు నుండి నేరుగా జనగామకు కల్పించాలని రెండు గంటలు రోడ్డుపై ధర్నా అనే వార్త ప్రజా వాణి దినపత్రికలో ప్రచురితం అయిన వార్తకు స్పందించారు. బస్సు వేళలలో ఎటువంటి మార్పులు చేయలేదు అర్ టి సి సిబ్బందిని అడిగి తెలుసుకొని సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు.

