ధర్మారావుపేట, శ్రీరాములపల్లె పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం
దండే పల్లి మండల్ , సెప్టెంబర్ 9 (సక్రమ ప్రజావాణి):
ధర్మారావుపేట–శ్రీరాములపల్లె పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల అల్పాహార కార్యక్రమాన్ని సర్పంచ్ కొత్త ధర్మయ్య బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నక్క చంద్ర మొగిలి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొత్త ధర్మయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఏకాగ్రత, విద్యాప్రగతి పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు అల్పాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

