📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణధర్మారావుపేట, శ్రీరాములపల్లె పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం

ధర్మారావుపేట, శ్రీరాములపల్లె పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం

📰 Generate e-Paper Clip

ధర్మారావుపేట, శ్రీరాములపల్లె పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం

దండే పల్లి మండల్ , సెప్టెంబర్‌ 9 (సక్రమ ప్రజావాణి):

ధర్మారావుపేట–శ్రీరాములపల్లె పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల అల్పాహార కార్యక్రమాన్ని సర్పంచ్‌ కొత్త ధర్మయ్య బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నక్క చంద్ర మొగిలి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ కొత్త ధర్మయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఏకాగ్రత, విద్యాప్రగతి పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు అల్పాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.