📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు బీఆర్ఎస్ నిరసన

కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు బీఆర్ఎస్ నిరసన

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు బీఆర్ఎస్ నిరసన

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు

పెద్దవంగర, సెప్టెంబర్ 08 ప్రజావాణి. .కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దవంగర మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై దాడులు, మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యవహారాన్ని ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని గ్రామాలలో ప్రారంభించిన పనులను పూర్తి చేయకుండా మాయ మాటలతో పబ్బం కడుపుతున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో వి. రామచంద్రయ్య శర్మ , శ్రీరామ్ సంజయ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీరామ్ సుధీర్, రసాల సమ్మయ్య, కనుకుంట్ల వెంకన్న మండల పార్టీ ఉపాధ్యక్షుడు, దుంపల సమ్మయ్య, సల్దెండి సుధాకర్, కుందూరు వెంకన్న, గుగులోతు కవిత సర్పంచులు, పసులేటి వెంకట్రామయ్య , నిమ్మల విజయ గ్రామ పార్టీ అధ్యక్షురాలు, కేశబోయిన కుమారస్వామి, చిలుక బిక్షపతి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు, కూకట్ల వీరన్న, వల్లపు యాకయ్య, నునావత్ బాలు , శ్రీరామ్ రాము, మొర్రిగాడుదుల శ్రీను మాజీ ఉపసర్పంచులు, కూతురు అనుదీప్, శ్రీరామ్ నవీన్, కూకట్ల సతీష్, బొల్లు సతీష్, జి. భరత్, బొమ్మెర నాగేష్, పాకనాటి సోమిరెడ్డి, పోతుగంటి శ్రీశైలం, బోనం యాకయ్య, యాసరపు ప్రవీణ్, కొమ్ము ఐలయ్య, ఎండి హఫీజ్, మహాకాళి యాకయ్య తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.