📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచలో హైదరాబాద్ ను విజవంతం చేయండి

చలో హైదరాబాద్ ను విజవంతం చేయండి

📰 Generate e-Paper Clip

చలో హైదరాబాద్ ను విజవంతం చేయండి

ఉద్యోగుల సంక్షేమానికి పీఆర్సీ, డిఏలు విడుదల చేయాలి

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్8,ప్రజావాణి :

 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటంలో భాగంగా సెప్టెంబర్ 10న చేపడుతున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని ఎంప్లాయీస్ జెఎసి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు షేక్ యాకూబ్ పిలుపు నిచ్చారు. మంగళవారం కురవి మండలం లోని గుండ్రాతిమడుగు ఉన్నత పాఠశాలలో ధర్నా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం యాకూబ్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంపై యుద్ధం చేయడం లేద ని, గాంధేయ మార్గంలో తమ న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. పిఆర్సి గడువు పూర్తయి మూడేళ్లు దాటినా కమిటీ నివేదిక రాకపోవడం తీవ్ర ఆందోళనక రమన్నారు. కొత్తగా ఎలాంటి అనుచిత కోరిక లు కోరడం లేదని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పిఆర్సిని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో పిఆర్సి అమలుతో పాటు పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్దరించాలని, పెండింగ్ బిల్లుల ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ.8,000 కోట్ల బకాయిలు చెల్లించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా రూ.10,000 కోట్లకు పైగా బకాయి లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 10 న హైదరా బాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహి రంగసభకు జిల్లా నుంచి వేల మంది ఉద్యోగులు తర లిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గుండ్రాతిమడుగు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె జానయ్య,

మండల నాయకులు, ఉపాధ్యాయులు ఎం ప్రవీణ్ కుమార్, యాదగిరి, మహేష్, సోమయ్య, సురేష్, శ్రీధర్, కమల్ కిషోర్, బాబు , గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.