ఎండపల్లి మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు గుర్తింపు కార్డు (Farmer ID) నమోదు కార్యక్రమం వేగంగా జరుగుతోంది. పీఎం కిసాన్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికీ, ఆన్‌లైన్‌లో ఎరువులు బుక్ చేసుకోవడానికీ ఈ కార్డు తప్పనిసరని. కార్డు లేని రైతులు వెంటనే సమీప రైతువేదికల్లో AEOలను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో AO కె. మహేష్, AEOలు సందీప్, లావణ్య, మౌనిక పాల్గొని రైతులకు నమోదు ప్రాధాన్యతపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎండపల్లిలో రైతు గుర్తింపు కార్డుల నమోదు కార్యక్రమం
RELATED ARTICLES

