📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఉద్యమ సహచరురాలు పాముల నీలమ్మ కన్నుమూత

ఉద్యమ సహచరురాలు పాముల నీలమ్మ కన్నుమూత

📰 Generate e-Paper Clip

ఉద్యమ సహచరురాలు పాముల నీలమ్మ కన్నుమూత

పాముల సుబ్బన్న మాదిగ సతీమణి మృతిపై ఎమ్మార్పీఎస్ నేతల సంతాపం

ఉద్యమంతో విడదీయరాని అనుబంధం.. దంపతులిద్దరికీ ఉద్యమ వందనాలతో నివాళులు

మంద రాజు మాదిగ
కరీంనగర్ జిల్లా ఇన్చార్జి

ప్రజావాణి దామెర
దామెర/పులుకుర్తి: ఎమ్మార్పీఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్ ఉద్యమ నాయకులు కీర్తిశేషులు పాముల సుబ్బన్న మాదిగ గారి సతీమణి పాముల నీలమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు, ఉద్యమకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన పాముల సుబ్బన్న మాదిగ కుటుంబం ఉద్యమ మొదటి దశ నుండి సంవత్సరం నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని ఉద్యమంతో అనుబంధంగా కొనసాగుతూ వచ్చిందని నాయకులు గుర్తు చేసుకున్నారు. పాముల సుబ్బన్న మాదిగ, ఆయన సతీమణి నీలమ్మ దంపతులు ఉద్యమంలో తమవంతు పాత్ర పోషిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రయాణంలో భాగస్వాములయ్యారని తెలిపారు.

కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరి మృతి

ఇటీవల పాముల సుబ్బన్న మాదిగ మృతి చెందగా, కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన సతీమణి పాముల నీలమ్మ కూడా అనారోగ్యంతో కన్నుమూయడం ఉద్యమ వర్గాలను విషాదంలో ముంచింది. ఒకే కుటుంబానికి చెందిన ఉద్యమంతో అనుబంధం ఉన్న ఈ దంపతులిద్దరి మరణం ఎమ్మార్పీఎస్ కుటుంబానికి తీరని లోటుగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.

పాముల నీలమ్మ గారి అంత్యక్రియలు సెప్టెంబర్ 8న ఉదయం పులుకుర్తి గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉద్యమ వందనాలతో ఘన నివాళి

పాముల సుబ్బన్న మాదిగ, పాముల నీలమ్మ దంపతులు ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఎమ్మార్పీఎస్ తరఫున వారికి ఉద్యమ వందనాలతో ఘన నివాళులు అర్పిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ తెలిపారు.

వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, ఉద్యమ సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబానికి ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించరూ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.