📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaవర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.

మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతని మండలం దుబ్బ పల్లి గ్రామంలో ప్రభుత్వ వైద్యులచే గ్రామ సర్పంచి ఎ రవెల్లి కృష్ణవేణి నరేష్ రావు ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది గ్రామ ప్రజలు చాలామంది డాక్టర్లచే తమ తమ సమస్యలు చెప్పుకొని మందులు తీసుకున్నారు మరికొంతమంది టెస్టులు చేయించుకున్నారు డాక్టర్లు వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురిసిన తర్వాత పరిసరాల్లో నీరు నిల్వ ఉండడం దోమల వృద్ధి కారణంగా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు ప్రజలు ఇల్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలని సూచించారు దోమలు నివారణకు దోమతెర వాడాలని మందులు వాడాలని చెప్పారు వర్షాకాలంలో కలుషితనీరు అపరిశుభ్రమైన ఆహారం వల్ల జ్వరాలు విరోచనాలు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే కారణాలు ఉన్నందున కాచి చల్లార్చిన లేదా సురక్షితమైన నీటిని మాత్రమే త్రాగాలని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ప్రభుత్వ వైద్యులు ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ సిబ్బంది కా రో బాల్ గ్రామ కార్యదర్శి ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.