📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyతెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పై అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పై అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పై అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
….. రాష్ట్ర టీపీసీసీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అశ్వక్ అలీ వెల్లడి.
…. బి ఆర్ ఎస్ పార్టీ దీనికి బాధ్యత వహిస్తూ కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 7. ప్రజావాణి. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి.దళిత ముద్దుబిడ్డ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పై ఎం.ఎల్.సి తాతా మధు. చేసిన అత్యంత హేయమైన. నీచమైన. సర్వ సమాజం సిగ్గుపడే మరియు మానవ సమాజాన్ని కించపరిచే వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అశ్వక్ అలీ. తీవ్రంగా ఖండించారు . సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశ్వక్ అలీ మాట్లాడుతూ ఇది ఒక వ్యక్తిపై చేసిన దాడి కాదు ఇది రాజ్యాంగంపై దాడి. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడి. ఇటువంటి సంఘటనలను  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్ గారిపై కించపరిచేలా మాట్లాడటం సభా ప్రాంగణంలోనే ఇంత నీచనికి దిగజారడం చరిత్రలో చీకటి రోజు. భారతదేశ చరిత్రలో ఏ చట్టసభల్లోను ఇలాంటి దుర్మార్గం జరగలేదన్నారు. అధికారం పోయింది అనే అక్కస్సుతో ఓర్వలేక ఇలాంటి పిచ్చి  ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ తాత మధు. గారు వెంటనే బేషరతుగా   తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా శాసనసభ  స్పీకర్ గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని అదేవిధంగా శాసనమండలి నుండి బర్తరపు చేయాలని రాష్ట్ర టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అశ్వక్ అలీ. డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.