📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakనిద్రపోతున్న నిఘా నేత్రాలు

నిద్రపోతున్న నిఘా నేత్రాలు

📰 Generate e-Paper Clip

*నిద్రపోతున్న నిఘా నేత్రాలు*

*నిరుపయోగంగా నిఘా నేత్రాలు… నేరగాళ్లకు వరంగా సిసి కెమెరాలు..*

*ఖాకీలకు కష్టాలు… కెమెరాలకు నిద్ర!*

*కేసుల పరిష్కారంలో ఖాకీలకు సవాల్…*

టేక్మాల్ సెప్టెంబర్ 7:(మన ప్రజావాణి) మండల వ్యాప్తంగా కదులూరు,సాలోజి పల్లి, కుసంగి, ఆయా గ్రామాలలో ఆగ మేఘాల మీద ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలు నిరుపయోగంగా ఉండిపోయాయి ,నేరాలను అరికట్టాల్సిన నిఘా నేత్రాలే నేరగాళ్లకు వరంగా మారుతున్నాయా? ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, నిర్వహణ లోపాలతో మూలనపడటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రధాన కూడళ్లలో కెమెరాలు కనిపిస్తున్నా.. నేరం జరిగినప్పుడు మాత్రం అవి ఆధారాలు చూపలేని దుస్థితి నెలకొంది. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన కోట్ల విలువైన నిఘా వ్యవస్థ ఇలా నిరుపయోగంగా మారడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమన్న సూక్తిని పలు సందర్భాల్లో పోలీసు అధికారులు వల్లించిన ఆచరణలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిఘా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది టెక్మాల్ మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు కుల సంఘాలు వివిధ సంఘాల సహకారంతో పోలీసులు కొన్నేళ్ల క్రితం డబ్బులు సేకరణ చేసి ఆ డబ్బుతో గ్రామాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయించారు, కెమెరాలు ఉన్నాయి… కానీ నిఘా లేదు! ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నిఘా నేత్రాలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.