📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialమందమరి తహసీల్దార్ పై దాడి యత్నం

మందమరి తహసీల్దార్ పై దాడి యత్నం

📰 Generate e-Paper Clip

మందమరి తహసీల్దార్ పై దాడి యత్నం

కలకలం రేపిన ఘటన
తనని కొందరు వెంబడించారని చెబుతున్న తహసిల్దార్
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

మన ప్రజావాణి
మందమర్రి

మందమర్రి మండలం తాసిల్దార్ పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది శనివారం రాత్రి విధులు ముగించుకుని వెళ్తున్న మండల తహసిల్దార్ పానుగంటి సతీష్ కుమార్ శర్మను లక్ష్యంగా చేసుకొని దుండగులు దాడికి యత్నించినట్లు ఆదివారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో వాహనాన్ని వెంబడించినట్లు అనంతరం ఇంటి వద్ద అర్ధరాత్రి దాటి ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఇంటి వద్ద అనుమాస్పదంగా సంచరించినట్లు సమాచారం తాసిల్దార్ ను లక్ష్యంగా చేసుకొని దాడికి యత్నించడానికి అసలు కారణం ఏంటి అని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనతో రెవెన్యూ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారి పైనే దాడికి యత్నించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని పలువురు పేర్కొంటున్నారు ఘటనపై పోలీసులు సమగ్రంగా గుర్తించి దాడి వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారికే రక్ష లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రజలు సందిగ్గంలో లో పడ్డారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.