📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialకాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై BRS నిరసన: పాతగూడూరులో 'బాకీ కార్డుల' పంపిణీ

కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై BRS నిరసన: పాతగూడూరులో ‘బాకీ కార్డుల’ పంపిణీ

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 06 (ప్రజావాణి):

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు (33 నెలలు) పూర్తయినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని BRS నాయకులు మండిపడ్డారు. ఆదివారం రోజున ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామంలో BRS నాయకులు, కార్యకర్తలు ‘ఇంటింటికీ వాడవాడకూ’ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలసి, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చెల్లించాల్సి ఉన్న హామీల వివరాలతో కూడిన ‘బాకీ కార్డులను’ అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1000 రోజులైనా హామీలు నెరవేర్చకపోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో BRS మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, బాకీ ఉన్న పథకాలను తక్షణమే అమలు చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు BRS సీనియర్ నాయకులు ఉప్పు రాజయ్య, ముక్తి చెందు, బోయిని మధు, కొయ్యడ శ్రావణ్, భారత రాజు, గుడిమల్ల సందీప్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.