కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై BRS నిరసన: పాతగూడూరులో ‘బాకీ కార్డుల’ పంపిణీ

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 06 (ప్రజావాణి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు (33 నెలలు) పూర్తయినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని BRS నాయకులు మండిపడ్డారు. ఆదివారం రోజున ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామంలో BRS నాయకులు, కార్యకర్తలు 'ఇంటింటికీ వాడవాడకూ' తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలసి, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చెల్లించాల్సి ఉన్న హామీల వివరాలతో కూడిన 'బాకీ కార్డులను' అందజేశారు. ఎన్నికల ముందు...