📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaప్రజల దాహర్తిని తీర్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రజల దాహర్తిని తీర్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ మండలం చామలపల్లి గ్రామంలో పూర్తి స్థాయి నీటి ఏద్దటి తో గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎమ్మెల్యే తన సొంత నిధులతో బోరు వేయించడం జరిగింది. అదేవిదంగా ఈ బోరులో నీరు అధికంగా రావడంతో అట్టి విషయాన్నీ చండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానితో ఎమ్మెల్యే ఆదివారం మోటార్ ఫిట్ చేయించడం జరిగింది. నీరు అధికంగా రావడంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి, చామలపల్లి సర్పంచ్ ముదిగొండ ఆంజనేయులు, సీనియర్ నాయకులు కట్టేకోల రామేశ్వరరావు, కాసాల జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నేర్లకంటి రవికుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు రాచమళ్ళ మణిపాల్ రెడ్డి, పగిల్ల అంజయ్య, కాటం రవి, నాగటి శంకర్, నేర్లకంటి దయాసాగర్, నరేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.