📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సర్పంచ్‌లకు విలువాధారిత సామర్థ్య పెంపు శిక్షణ

సర్పంచ్‌లకు విలువాధారిత సామర్థ్య పెంపు శిక్షణ

📰 Generate e-Paper Clip

రాష్ట్రవ్యాప్తంగా 576 మంది సర్పంచ్‌లకు శిక్షణ..

ఎంపికైన గూడెం సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్

బెజ్జంకి , సెప్టెంబర్ 6 (ప్రజావాణి)

హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో సర్పంచ్‌ల కోసం ఒకరోజు విలువాధారిత సామర్థ్య పెంపు మరియు శ్రేయస్సు కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నారు.తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 576 మంది సర్పంచ్‌లను నామినేట్ చేశారు.ఈ శిక్షణలో విలువాధారిత నాయకత్వం, సామర్థ్య పెంపు, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.ఈ యొక్క కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా పరిధిలోని బెజ్జంకి మండలం గూడెం గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్  ఎంపికయ్యారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నిరంతర అభ్యాసంతో ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగేందుకు ఈ శిక్షణ ఉపయోగపడనుందని  తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.