సర్పంచ్‌లకు విలువాధారిత సామర్థ్య పెంపు శిక్షణ
రాష్ట్రవ్యాప్తంగా 576 మంది సర్పంచ్‌లకు శిక్షణ.. ఎంపికైన గూడెం సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ బెజ్జంకి , సెప్టెంబర్ 6 (ప్రజావాణి) హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో సర్పంచ్‌ల కోసం ఒకరోజు విలువాధారిత సామర్థ్య పెంపు మరియు శ్రేయస్సు కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నారు.తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 576 మంది సర్పంచ్‌లను నామినేట్ చేశారు.ఈ శిక్షణలో విలువాధారిత నాయకత్వం, సామర్థ్య పెంపు, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు తదితర అంశాలపై అవగాహన...