📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పారిశుద్ధ్యంపై సర్పంచ్ ప్రత్యేక శ్రద్ద... స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త తరలించిన సర్పంచ్ మల్లయ్య...

పారిశుద్ధ్యంపై సర్పంచ్ ప్రత్యేక శ్రద్ద… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త తరలించిన సర్పంచ్ మల్లయ్య…

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, సెప్టెంబర్ 5 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో పారిశుద్ధ్య పనులపై గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు సర్పంచ్ మల్లయ్య స్వయంగా పారిశుద్ధ్య ట్రాక్టర్ నడిపి చెత్తను సేకరించారు. అనంతరం చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా గ్రామంలో పారిశుద్ధ్య చర్యలను నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.సర్పంచ్ స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మల్లయ్యను అభినందిస్తూ, గ్రామాభివృద్ధితో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.