పారిశుద్ధ్యంపై సర్పంచ్ ప్రత్యేక శ్రద్ద… స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త తరలించిన సర్పంచ్ మల్లయ్య…
బెజ్జంకి, సెప్టెంబర్ 5 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో పారిశుద్ధ్య పనులపై గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు సర్పంచ్ మల్లయ్య స్వయంగా పారిశుద్ధ్య ట్రాక్టర్ నడిపి చెత్తను సేకరించారు. అనంతరం చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా గ్రామంలో పారిశుద్ధ్య చర్యలను నిరంతరం కొనసాగిస్తామని...